నగర దర్శిని-నగర వికాసం

నగర దర్శిని-నగర వికాసం

రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం సీ.ఎం చంద్రబాబునాయుడికి ప్రజలంతా అండగా ఉండాలని ఎం.పి.శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ, అన్నారు.రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం స్ధానిక 35వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగర దర్శిని-నగర వికాసం..కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ గారు తుమ్మలోవ వీధులలో లోని గృహాలను సందర్శించి స్ధానికులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీశారు. వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న ఫించన్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెదేపా అని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి మద్దతు తెలపాలని కోరారు.కార్యక్రమంలో మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషాసాయి,35 వ వార్డ్ కార్పేరేటర్ కరగని మాధవి వేణు మరియు కార్పేరేటర్లు డివిజన్ కమిటీ మెంబర్లు , స్థానిక నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.