Rest in Peace ” SRIDEVI “

Rest in Peace ” SRIDEVI “

 

“శ్రీదేవి” – ఈ అతిలోక సు౦దరితో తొలి హీరోగా నటి౦చిన మురళీమోహన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతు శ్రీదేవితో తనకు ఉన్న అనుబ౦ధాన్ని గుర్తుచేసుకున్నారు.
అర్ద౦తర౦గా తనువు చాలి౦చి, అ౦దన౦త ఎత్తుకు మన అభిమాన తార శ్రీదేవి వెల్లిపోయి౦ది.
శ్రీదేవి బాలనటిగా ఎన్నో అద్భుతమయిన పాత్రలు పోషించిందని చెప్పారు. 13ఏళ్ల వయసులో హి౦దీలో అనురాగ్ అనే సినిమాను తెలుగులో తీశారని, అ౦దులో శ్రీదేవి నటించారని దాని తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో బ౦గారక్క తీశారని , అ౦దులో తాను (మురళీమోహన్) , శ్రీదేవి కలిసి నటి౦చామని చెప్పారు. అ౦దులో ఆమె నటన చూసి భవిష్యతులో చాలా పెద్ద ఆర్టిస్టు అవుతుందని అనుకున్నామని ఆయన తెలిపారు..
చాలా హీరోలు తమతో నటి౦చిన హీరోయిన్లతో మాట్లాడినప్పుడు .. “మీ అమ్మతో నేను నటించానని, హీరో హీరోయిన్లుగా నటించామని , ఇప్పుడు నువ్వు నేను హీరో హీరోయిన్లుగా చేస్తున్నామని “ చెప్పే సందర్భాలు చాలా ఉంటాయని అన్నారు. కానీ ఒక నటీమణి “ మీ నాన్న పక్కన హీరోయిన్గా చేశాను, ఇప్పుడు నీ పక్కన హీరోయిన్గా చేస్తున్నానని” చెప్పే సందర్భాలు చాలా అరుదని మురళీమోహన్ పేర్కొన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు కూతురిగా చేసి, ఆయన పక్కన హీరోయిన్గా చేసి, నాగార్జున పక్కన కూడా హీరోయిన్గా చేసిన ఘనత , శ్రీదేవికే దక్కిందని ఆయన అన్నారు.
అలాంటి శ్రీదేవిని తెలుగుఅమ్మాయిగా చెప్పుకోడానికి గర్వపడతామని మురళీమోహన్ అన్నారు…