జయహో పోలవరం.

జయహో పోలవరం.

జయహో పోలవరం..496 రోజుల్లో రికార్డు..పోలవరం పనుల్లో పూర్తయిన కీలక ఘట్టం…

ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమించింది.అమలుకు నోచని విభజనహామీలతో అభద్రతాభావంలో కూరుకుపోయిన ఆంధ్రజాతికి ఇప్పుడు పోలవరం ప్రాణనాడి కాబోతోంది.ఆల్మట్టి నిర్మాణంతో ఆకారం కోల్పోయిన కృష్ణా బేసిన్‌కు జీవనాడై ఊపిరులు ఊదబోతోంది.అడుగడుగు విఘ్నాలతో ప్రాజెక్టు పై ప్రజలు ఆశలు కోల్పోతున్న దశలో ఈ విళంబి నామ సంవత్సరంలో పోలవరం ఊహలకు అందని ప్రొగ్రెస్‌ను సొంతం చేసుకున్నది.ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జరగడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది.సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు…