“ఆరోగ్యమే మహాభాగ్యం “- కొవ్వూరు

“ఆరోగ్యమే మహాభాగ్యం “- కొవ్వూరు

“ఆరోగ్యమే మహాభాగ్యం “….ఎంత కాలం బతికామన్నది కాదు ఎంత ఆరోగ్యంగా బతికామన్నది ముఖ్యం.. దీనికోసమై మన ఎం.పి గారు కొవ్వూరు లో ఓ.ఎన్.జి.సి. వారి సహకార్యంతో “మురళీమోహన్ చారిటబుల్ ట్రస్టు” ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిగారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధా రాణి గారి సహకారంతో “ఉచిత మెగా సూపర్ స్పెషాలిటి వైద్య శిబిరం ”
మే 7 అనగా సోమవారం ఉదయం 9 గం|| నుంచి సాయంత్రం 4 గం|| వరుకు కొవ్వూరు యువరాజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతుంది.
ఈ వైద్య శిబిరం లో ప్రజలకొరకు
గుండె,మెదడు,మూత్రపిండాలు,క్యాన్సర్,కీళ్ళవ్యాధులు,వెన్నుముక్క,కంటి,
చర్మ,దంత, ముక్కు,నోరు మొదలైన సమస్యలకు పరీక్ష చేసి తగిన
మందులను అందిస్తారు… ఇందుచేత యావన్మంది ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ……ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు ను కోరుకునే…………..

మీ మాగంటి మురళీమోహన్
పార్లమెంట్ సభ్యుడు,రాజమహేంద్రవరం.